ప్రతి సంవత్సరం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ని june 5 న జరుపుకుంటారు.
మనల్ని భరిస్తున్న భూమికి మనం రిటర్న్ గిఫ్ట్ గా పొల్యూషన్ ఇస్తున్నాం .
ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చాల తప్పులు అనుకోకుండా చేసి మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నాం .
నిజం చెప్పాలంటే చాలా మటుకు మారాము అనిపిస్తుంది .
ప్లాస్టిక్ బాగ్స్ వాడకం తగ్గించాం (నిజం చెప్పాలంటే బలవంతం గా తగ్గించారు అని చెప్పాలి ) . మనం ఇంటి నుండి బయటికి కూరలు తెచ్చుకోడానికి వెళ్తున్నాం అంటే మనం bag తీసుకుని వెళ్ళాలి కదా ?
ఆ మాత్రం కూడా మనకి గుర్తు ఉండదు .
కూరల కొట్టుకి వెళ్లి ఆ కవర్ లో వేసి ఇచ్చే అని చెపుతాం(ఇక్కడ కొన్ని కక్కుర్తి మొహాలు కూడా ఉంటాయి . ఇంట్లో చెత్త వేసుకోడం కోసం extra బాగ్స్ తీసుకుంటాయి ).
అసలు ఈ పొల్యూషన్ ఎలా తగ్గించాలి ?
చెత్త ని dry waste , wet waste గా డివైడ్ చేసి ఇంట్లో వీలు ఐనవి కంపోస్ట్ చేసుకోవాలి .
మనం రోజూ వేసే చెత్త వాళ్ళ ల్యాండ్ ఫిల్స్ పెరిగిపోతుంటాయ్ . దాని వల్ల ఆ ల్యాండ్ ఫిల్స్ చుట్టూ పక్కల దోమలు , ఈగలు , రోగాలు .
అసలు మన ఇంట్లో ఎలాంటి చెత్త వస్తుంది అని మనం అనలైజ్ చేసుకోగలిగితేయ్ , చాలా మటుకు తగ్గుతుంది .
ఉదాహారానికి :బ్యాటరీస్ , ఇవి మనం వాడి పడేస్తుంటాం . కానీ అలా పడెయ్యడం వల్ల వాటిలో ఉన్న కెమికల్స్ భూమి లోకి చేరి మల్ల మనం తినే ఆహరం లోకి చేరుతుంది . మరి మనం ఎం చెయ్యొచ్చు ?రిమోట్ లు, పిల్లల ఆట వస్తువులు , వీటికి బాటరీ లు కావాలి కదా ? మనం rechargeable బ్యాటరీస్ వాడొచ్చు . ఈ బాటరీ మల్ల కరెంటు తో ఛార్జ్ చేసుకుని వాడుకోవచ్చన్నమాట .
ఇది పూర్తి గా పొల్యూషన్ ని నివారించదు కానీ కొంత వరకు తగ్గిస్తుంది .
అలాగే ఇంటి నుండి బయటికి వెళ్ళేటప్పుడు , బాగ్ తీసుకుని వెళ్ళండి .
కార్ లోనో బైక్ లోనో ఒక bag వేసి ఉంచండి .
ఇంకా చెప్పాలంటే e commerce వెబ్సైట్ లో మనం వాడే పర్సు లో పట్టేంత బాగ్స్ కూడా ఉంటాయి .
షాంపూ బదులు కుంకుడు కాయలు వాడొచ్చు .
ఎమన్నా కొనేవి ప్లాస్టిక్ అంటే మానెయ్యాలి . చక్కగా మన అమ్మ , అమ్మమ్మ కలం లో లాగా స్టీల్ , గాజు , పింగాణీ వాడుకుందాం .
ఒక ప్లాస్టిక్ bag 20 సంవత్సరాలు పడుతుందంట భూమి లో కలవడానికి !! ఒక straw 200 సంవత్సరాలు పడుతుందంట !! టూత్ బ్రష్ లు , డైపర్ లు 500 సంవత్సరాలు ..మనం అన్ని ఆపెయ్యలేం , మానలేం కనీసం మన చేత ఐనంత మనం ప్లాస్టిక్ కి దూరం గా ఉందాం పర్యావరణాన్ని కాపాడదాం.
Comments
Post a Comment